పవన్ గెలిస్తే ఇక్కడే షూటింగ్... ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం

  • తండ్రీకూతుళ్ల బంధం నేపథ్యంలో 'పిఠాపురంలో... అలా మొదలైంది' చిత్రం
  • రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫ్యామిలీ డ్రామా
  • పవన్ కళ్యాణ్ గెలుపుతో పిఠాపురంలోనే షూటింగ్ జరిపిన చిత్రబృందం
  • మే 1న థియేటర్లలోకి రానున్న సినిమా
సీనియర్ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘పిఠాపురంలో... అలా మొదలైంది’ అనే కుటుంబ కథా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే అనుబంధాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ఈ సినిమాను రూపొందించారు. ‘ప్రేయసిరావే’ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 1న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాతలు మీడియా సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.

నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ మాట్లాడుతూ, "మా దర్శకుడు జనసేన అభిమాని. పవన్ కల్యాణ్ గెలిస్తే పిఠాపురంలోనే సినిమా తీస్తానని మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకుంటూ 75 శాతం షూటింగ్ అక్కడే పూర్తి చేశాం. సినిమా పేరులో పిఠాపురం ఉన్నప్పటికీ, ఇందులో ఎలాంటి రాజకీయ అంశాలు ఉండవు. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం" అని స్పష్టం చేశారు.

మరో నిర్మాత, పిఠాపురం జర్నలిస్ట్ అయిన ఎఫ్. ఎం. మురళి మాట్లాడుతూ, తన ఇంట్లోనే షూటింగ్ జరగడం, దర్శకుడి పనితీరు నచ్చి తాను ఈ ప్రాజెక్టులో భాగమైనట్లు చెప్పారు. నిర్మాత ఆకుల సురేష్ పటేల్ మాట్లాడుతూ, రాజేంద్ర ప్రసాద్ తన పాత్రకు వంద శాతం న్యాయం చేశారని అన్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు కంటతడి పెట్టుకున్నారని, మౌత్ టాక్‌తో సినిమా విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి ఈ చిత్రాన్ని నిర్మించారు. కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

Pithapuramlo... Ala Modalaindi
Family Drama
Movie
Rajendra Prasad
Prithviraj
Mahesh Chandra

More Telugu News